saimadhav: సావిత్రి పాత్రకి మాటలు రాస్తుంటే కన్నీళ్లొచ్చాయి: సాయిమాధవ్ బుర్రా

  • కష్టాలు ఎదురైనా కన్నీళ్లు వచ్చేవి కావు
  • అందుకు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టలేదు
  • మంచి సినిమా చూస్తున్నప్పుడు కన్నీళ్లు వస్తాయి      

మాటల రచయితగా సాయిమాధవ్ బుర్రాకి మంచి గుర్తింపు వుంది. సందర్భానికి తగినట్టుగా .. పాత్రల స్వభావానికి తగినట్టుగా సంభాషణలు రాయడం ఆయన ప్రత్యేకత. అలాంటి సాయిమాధవ్ తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు.

"నాకు కష్టాలు ఎదురైనప్పుడు కన్నీళ్లు రావు .. ఒక మంచి సినిమా చూసినప్పుడు .. ఒక మంచి సీన్ చూసినప్పుడు కన్నీళ్లు వస్తుంటాయి. 'మహానటి' సినిమాకి రాస్తున్నప్పుడు నేను కొన్ని పాత్రల్లోకి వెళ్లిపోవడం జరుగుతూ ఉండేది. సావిత్రి పాత్రకి మాటలు రాయాలంటే నేను ఆమె పాత్రలోకి వెళ్లి .. ఆమె ఎలా స్పందిస్తుందో అలా రాయవలసి వుంటుంది. అలా సావిత్రిగారిలా ఆలోచించేటప్పుడు చాలాసార్లు నా కళ్లవెంట నీళ్లొచ్చి పేపర్లు తడిసిపోయాయి" అంటూ చెప్పుకొచ్చారు.    

  • Loading...

More Telugu News