Karnataka: కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల.. బీజేపీకే అత్యధిక స్థానాలంటోన్న పలు సంస్థలు!
- ఇండియా టుడే-ఆక్సిస్ మై ఇండియా సర్వేలో కాంగ్రెస్‌కి అత్యధిక సీట్లు
- రిపబ్లిక్ టీవీ- జన్ కీ బాత్‌లో బీజేపీకి అత్యధిక స్థానాలు
- ప్రజాన్యూస్, న్యూస్ నేషన్లోనూ బీజేపీకే
ప్రస్తుతం దేశ ప్రజల దృష్టంతా కర్ణాటక ఎన్నికలపైనే ఉంది. అంతగా ఆసక్తిరేపిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫలితాలు ఈ నెల 15న వెల్లడి కానున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నువ్వా? నేనా? అన్నట్లు పోటీ పడ్డాయి. జేడీఎస్ ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతుందని ఎన్నికల ముందు పలు సర్వేలు చెప్పిన విషయం తెలిసిందే. కాగా, ఈ పోలింగ్‌కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పలు సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఈ ఎన్నికలు మొత్తం 222 స్థానాలకు జరిగాయి.
ఇండియా టుడే-ఆక్సిస్ మై ఇండియా:
కాంగ్రెస్: 106-118
బీజేపీ: 79-92
జేడీఎస్: 22-30
ఇతరులు: 1-4
టైమ్స్ నౌ-వీఎంఆర్:
కాంగ్రెస్: 90-103
బీజేపీ: 80-93
జేడీఎస్: 31-39
ఇతరులు: 2-4
రిపబ్లిక్ టీవీ- జన్ కీ బాత్:
కాంగ్రెస్: 73-82
బీజేపీ: 95-114
జేడీఎస్: 32-43
ఇతరులు: 2-3
ప్రజాన్యూస్:
కాంగ్రెస్: 72-78
బీజేపీ: 102-110
జేడీఎస్: 35-39
ఇతరులు: 0-5
న్యూస్ నేషన్:
కాంగ్రెస్: 71-75
బీజేపీ: 105-109
జేడీఎస్: 36-40
ఇతరులు: 3-5
ఏబీపీ:
కాంగ్రెస్: 87-99
బీజేపీ: 97-109
జేడీఎస్: 21-30
ఇతరులు: 1-8
సీవోటర్:
కాంగ్రెస్: 87-99
బీజేపీ: 97-109
జేడీఎస్: 21-30
ఇతరులు: 1
దిగ్విజయ న్యూస్:
కాంగ్రెస్: 76-80
బీజేపీ: 103-107
జేడీఎస్: 31-35
ఇతరులు: 4-8