nri: విదేశాల్లో పనిచేస్తూ స్వదేశానికి నిధులు పంపేవారిలో భారతీయులు నంబర్1

  • 2017లో ఎన్ఆర్ఐల నుంచి 69 బిలియన్ డాలర్లు
  • 64 బిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానం
  • 33 బిలియన్ డాలర్లతో ఫిలిప్పీన్స్ మూడో స్థానం

విదేశీ గడ్డపై కష్టపడి సంపాదించి స్వదేశానికి నిధులు భారీగా పంపుతూ ప్రవాస భారతీయులు భారత్ ను అగ్ర ప్రథాన నడిపిస్తున్నారు. ప్రపంచంలో ప్రవాసుల నుంచి భారీ మొత్తంలో నిధులు అందుకుంటున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉందని రెమిట్ స్కోప్ అనే నివేదిక పేర్కొంది. 2017లో 69 బిలియన్ డాలర్ల (రూ.4.48 లక్షల కోట్లు) నిధులు ఎన్ఆర్ఐల నుంచి భారత్ కు వచ్చాయని తెలిపింది.

భారత్ తర్వాత ప్రవాసీ చైనీయులు 64 బిలియన్ డాలర్లు తమ మాతృదేశానికి పంపించి రెండో స్థానంలో ఉన్నారు. ఫిలిప్పీన్స్ 33 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉంది. పాకిస్తాన్ 20 బిలియన్ డాలర్లు, వియత్నాం 14 బిలియన్ డాలర్లతో టాప్-10లో నిలవడం విశేషం. ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాలకు ఇలా తరలి వచ్చిన నిధుల్లో 32 శాతం గల్ఫ్ దేశాలు, 26 శాతం అమెరికా, 12 శాతం యూరోప్ దేశాల నుంచి కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News