PETROL PRIXCES: కర్ణాటక ఎన్నికలు ముగియడంతో మళ్లీ మొదలైన ‘పెట్రో’ ధరల బాదుడు
- ఢిల్లీలో పెట్రల్ పై 17పైసలు, డీజిల్ పై 21 పైసలు పెరుగుదల
- గత నె 24న చివరి సారి సవరణ
- ఇన్ని రోజులుగా పెంపును పక్కన పెట్టిన చమురు కంపెనీలు
కేంద్రంలోని బీజేపీ సర్కారు తన స్వార్థ ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల సవరణను 20 రోజులుగా నిలిపివేసి, మళ్లీ ఈ రోజు నుంచి వాటిపై నియంత్రణలను తొలగించింది. వాస్తవానికి పెట్రోల్, డీజిల్ ధరలను ఏరోజు కారోజు క్రితం ముగింపు రోజు నాటి అంతర్జాతీయ ధరల ఆధారంగా దేశీయంగా సవరిస్తూ వస్తున్నారు.
అయితే, కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో పెట్రోలియం ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం ఆపేయించింది. దీంతో గత నెల 24 తర్వాత నుంచి ధరలు పెరగకుండా అలానే ఉండిపోయాయి. గత శనివారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం విదితమే. దీంతో మరోసారి ధరల సవరణ మొదలైంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 17 పైసలు పెంచారు. డీజిల్ పై 21 పైసలు పెరిగింది. కేంద్ర ప్రభుత్వమే ఆయిల్ కంపెనీలను ధరల సవరణ చేపట్టవద్దని నిరోధించి ఉంటుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.