Karnataka: చాముండేశ్వరిలో ఓటమి దిశగా సిద్ధరామయ్య.. బాదామిలో గట్టి పోటీ ఇస్తున్న శ్రీరాములు!
- చాముండేశ్వరిలో థర్డ్ రౌండ్ కౌంటింగ్ పూర్తి
- 8,440 ఓట్ల వెనుకంజలో సిద్ధరామయ్య
- మధ్య, తీర కర్ణాటక ప్రాంతాల్లో బీజేపీ హవా
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రజా వ్యతిరేకత తగిలినట్టుంది. ఆయన ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చాముండేశ్వరిలో ప్రజలు తమ ఓటు ద్వారా నిరూపిస్తున్నారు. ఇక్కడ మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. తన సమీప ప్రత్యర్థి, జేడీఎస్ కు చెందిన జీడీ దేవెగౌడపై సిద్ధరామయ్య 8,440 ఓట్ల వెనుకంజలో ఉన్నారని అధికారిక సమాచారం.
ఇక సిద్ఱరామయ్య పోటీపడిన రెండో నియోజకవర్గమైన బాదామిలో బీజేపీ అభ్యర్థి శ్రీరాములు నుంచి ఆయనకు గట్టిపోటీ ఎదురవుతోంది. మొత్తం 184 నియోజకవర్గాల్లో ఫలితాల సరళి తెలుస్తుండగా, కాంగ్రెస్ 79, బీజేపీ 79, జేడీఎస్ 26 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. గుల్బర్గా జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో, మధ్య కర్ణాటక, కోస్టల్ కర్ణాటక ప్రాంతాల్లో బీజేపీ హవా కొనసాగుతుండగా, బెంగళూరు, ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో కాంగ్రెస్ గాలి వీస్తోంది.