Karnataka: కర్ణాటక ఎన్నికల లేటెస్ట్ ట్రెండ్స్... బీజేపీ 93, కాంగ్రెస్ 88, జేడీఎస్ 29 స్థానాల్లో ఆధిక్యం
- ఇప్పటివరకూ 211 స్థానాల్లో ట్రెండ్స్
- చాముండేశ్వరిలో సిద్ధరామయ్య వెనుకంజ
- హంగ్ తప్పేలా లేదంటున్న విశ్లేషకులు
మొత్తం 224 స్థానాలున్న కర్ణాటకలో రెండు నియోజకవర్గాల్లో ఎన్నికల వాయిదా తరువాత 222 స్థానాలకు ఈ నెల 12వ తేదీన ఎన్నికలు జరుగగా, ఈ ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇప్పటివరకూ 211 స్థానాల్లో ఒకటి నుంచి నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. బీజేపీ 93 స్థానాల్లో, కాంగ్రెస్ 88 స్థానాల్లో జేడీఎస్ 29 స్థానాల్లో, ఇతరులు ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది.
కర్ణాటకలో హంగ్ ప్రభుత్వం తప్పే పరిస్థితి లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. షికారిపురాలో యడ్యూరప్ప ఆధిక్యంలో ఉండగా, చాముండేశ్వరిలో సిద్ధరామయ్యపై జీటీ దేవెగౌడ 11 వేల ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. బాదామిలో మాత్రం సిద్ధరామయ్య, తన సమీప బీజేపీ ప్రత్యర్థి శ్రీరాములుపై 1,575 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.