Karnataka: ప్రభుత్వం ఏర్పాటు చేసే నైతికహక్కు ‘కాంగ్రెస్’కు లేదు: యడ్యూరప్ప
- కన్నడ ప్రజలు మార్పు కోరుతూ తీర్పు చెప్పారు
- ప్రజల తీర్పును కాలరాయడానికి కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోంది
- ప్రజా వ్యతిరేకత వల్ల జేడీఎస్ కు లాభం చేకూరింది
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై ఆ పార్టీ నేత యడ్యూరప్ప సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంద్భంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కన్నడ ప్రజలు మార్పు కోరుతూ తీర్పు చెప్పారని అన్నారు. ప్రజల తీర్పును కాలరాయడానికి కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోందని ఆరోపించారు.
కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసే నైతికహక్కు కాంగ్రెస్, జేడీ (ఎస్) పార్టీలకు లేదని అన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఖండిస్తున్నామని, ప్రజలు తిరస్కరిస్తున్నప్పటికీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పాకులాడుతోందని విమర్శించారు. ప్రజా వ్యతిరేకత వల్ల జేడీఎస్ కు లాభం చేకూరిందని, అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన తమనే గవర్నర్ తొలుత పిలవాలని అన్నారు.