ramgopal varma: తొలగిన న్యాయపరమైన చిక్కులు.. జూన్ 1న 'ఆఫీసర్' విడుదల!
- ఈ నెల 25న విడుదల చేయాలని తొలుత వర్మ నిర్ణయం
- సాంకేతిక అంశాల కారణంగా జూన్ 1కి వాయిదా
- వైటీ ఎంటర్ టైన్ మెంట్ బకాయిలు తీర్చేయడంతో తొలగిన చిక్కులు
నాగార్జున నటించిన 'ఆఫీసర్' చిత్రం విషయంలో వైటీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థతో వివాదాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిష్కరించుకున్నారు. తమకు వర్మ రూ.1.06 కోట్ల బకాయి ఉన్నారంటూ వైటీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ కోర్టుకెక్కింది. దీంతో ఈ నెల 18 లేదా చిత్రం విడుదలకు లోపే బకాయిలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే, విచారణకు వర్మ హాజరుకాకపోవడంతో చిత్రం విడుదలను నిరోధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దీంతో తర్వాతి విచారణకు వర్మ హాజరై వైటీ ఎంటర్ టైన్ మెంట్ కు మొత్తం బకాయిలను తీర్చేసి కన్సెంట్ ఆర్డర్ పై సంతకం చేశారు. దీంతో సినిమాను ఈ నెల 25న విడుదల చేయనున్నట్టు వర్మ ప్రకటించారు.
అయితే, సాంకేతిక కారణాల వల్ల సినిమా విడుదలను వర్మ వాయిదా వేశారు. ఈ నెల 25కు బదులు జూన్ 1న సినిమాను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. మంచి వీక్షణానుభవం కోసం ముందు అనుకున్న దాని కంటే ఆలస్యంగా విడుదల చేస్తున్నట్టు వివరించారు.