Karnataka: ఒక్కో ఎమ్మెల్యేకు మంత్రి పదవి, వంద కోట్లను బీజేపీ ఆఫర్ చేసింది: కుమారస్వామిగౌడ ఆరోపణ

  • కర్ణాటకలో అధికారం కోసం బీజేపీ వెంపర్లాడుతోంది
  • కేంద్ర సంస్థలతో ప్రతిపక్షాలను మోదీ బెదిరిస్తున్నారు
  • ఎమ్మెల్యేల కొనుగోళ్లను రాష్ట్రపతి, గవర్నర్, మోదీ ప్రోత్సహిస్తారా? 

జేడీఎస్ శాసనసభాపక్షనేతగా కుమారస్వామిగౌడ ఎన్నికయ్యారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం, కుమారస్వామిగౌడ మీడియాతో మాట్లాడుతూ, శాసనసభాపక్ష నేతగా తనను ఎన్నుకున్నందుకు పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ప్రధాని మోదీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయన మొహం చూసి ప్రజలు ఓట్లు వేయలేదని, సెక్యులర్ ఓట్లు చీలడం వల్లే బీజేపీకి 104 సీట్లలో విజయం లభించిందని విమర్శించారు.

కర్ణాటకలో అధికారం కోసం బీజేపీ వెంపర్లాడుతోందని, ఒక్కో ఎమ్మెల్యేకు మంత్రి పదవి, వంద కోట్లు ఇస్తామంటూ తన వైపు తిప్పుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లను రాష్ట్రపతి, గవర్నర్, మోదీ ప్రోత్సహిస్తారా? లేక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారా? అని ప్రశ్నించారు. కేంద్ర సంస్థలతో ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారని మోదీపై ఆరోపణలు చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీతో తాము చేతులు కలిపామని చెప్పారు. ఈ సందర్భంగా జేడీఎస్ నుంచి రేవణ్ణ వర్గం చీలుతుందన్న వార్తలను కొట్టిపారేశారు.  

  • Loading...

More Telugu News