Telangana: ముంచుకొస్తున్న హైబీపీ.. అధిక రక్తపోటు రోగుల్లో ద్వితీయ స్థానంలో తెలంగాణ!

  • సర్వేలో ఆందోళన కలిగించే అంశాలు వెల్లడి
  • హైబీపీ బారిన పడుతున్న తెలంగాణ
  • దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది హైబీపీ రోగులు

పాలన, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ రోగాల విషయంలోనూ అదే స్థానంలో ఉందని జాతీయ పోషకాహార సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇప్పటి వరకు మధుమేహ రోగుల విషయంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ అధిక రక్తపోటు (హైబీపీ) రోగుల విషయంలో ద్వితీయ స్థానంలో ఉందని తెలిపింది. రాజధాని హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా హైబీపీ రోగుల సంఖ్య అధికంగా ఉందని సర్వేలో బయటపడింది.

దేశవ్యాప్తంగా చూసుకుంటే  మొత్తం 14 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని, మరో పదేళ్లలో వీరి సంఖ్య 21.4 కోట్లకు చేరుతుందని వైద్యులు చెబుతున్నారు. పురుషుల్లో 39 శాతం, మహిళల్లో  29 శాతం మంది ఈ రోగంతో బాధపడుతున్నారని తెలిపారు. రక్తపోటును అదుపులో ఉంచుకోకపోతే పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, గుండె, కిడ్నీ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News