vangaveeti: తూ.గో జిల్లాలో వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం.. ఉద్రిక్తత
- తూర్పుగోదావరి జిల్లా వెలిచేరు గ్రామంలో ఘటన
- విగ్రహం నుంచి తలను వేరు చేసేందుకు యత్నించిన దుండగులు
- పోలీసు జాగిలాలు గుర్తు పట్టకుండా.. విగ్రహం చుట్టూ కారం చల్లిన వైనం
తూర్పుగోదావరి జిల్లా వెలిచేరు గ్రామంలో వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ఉద్రిక్తతను రాజేసింది. గుర్తు తెలియని దుండగులు విగ్రహం మెడ భాగం నుంచి తలను వేరు చేసేందుకు యత్నించారు. అంతేకాదు, పోలీసు జాగిలాలు గుర్తు పట్టకుండా విగ్రహం చుట్టూ కారం కూడా చల్లారు.
ఈ నేపథ్యంలో, కాపు సంఘం నేతలు వెలిచేరు గ్రామానికి చేరుకుని, రోడ్డుపై బైఠాయించి, ఆందోళనకు దిగారు. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, దోషులు ఎంతటి వారైనా వదలొద్దని పోలీసులను ఆదేశించారు. మహానుభావులను కులాలవారీగా చూడరాదని, వారిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. మహానుభావులను స్మరించుకునేందుకే విగ్రహాలను ఏర్పాటు చేస్తారని అన్నారు. త్వరలోనే రంగా నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.