BJP: చంద్రబాబు, కేసీఆర్... మీకిదే నా విజ్ఞప్తి: కుమారస్వామి

  • బీజేపీపై పోరాడేందుకు కలసిరండి
  • ప్రాంతీయ పార్టీలన్నీ కలసి పోరాడాలి
  • జేడీఎస్ ఎమ్మెల్యేలపై ఈడీతో దాడులు చేయిస్తున్న బీజేపీ
  • విమర్శలు గుప్పించిన కుమారస్వామి

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీపై పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, టీఆర్ఎస్ నేత కేసీఆర్ తమకు సహకరించాలని జేడీఎస్ నేత కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ కలసి ఐకమత్యంతో పోరాడాల్సిన సమయం వచ్చిందని, తమ పోరాటానికి కలసి రావాలని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో దాడులు చేయించి భయభ్రాంతులను చేయిస్తోందని కుమారస్వామి ఆరోపించారు.

కాగా, ఇటీవల కేసీఆర్ స్వయంగా బెంగళూరుకు వెళ్లి కుమారస్వామి, దేవెగౌడలతో తృతీయ కూటమిపై చర్చలు జరిపి వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా కలసి పోరాడాలని నిర్ణయించుకున్నందునే ఇప్పుడు తమకు మద్దతివ్వాలని కేసీఆర్ ను కుమారస్వామి కోరినట్టు తెలుస్తోంది. ఇక చంద్రబాబు కూడా బీజేపీతో తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో, ఆయన వైపు నుంచి కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కుమారస్వామి భావిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News