hyderabad: హైదరాబాదులో కుండపోత వర్షం, వడగళ్లు, ఈదురుగాలులు
- హైదరాబాదులో ఒక్కసారిగా మారిన వాతావరణం
- పట్టపగలే అలముకున్న చీకటి
- విరిగిపడ్డ హోర్డింగ్ లు
హైదరాబాదును ఒక్కసారిగా భారీ వర్షం ముంచెత్తింది. కుండపోతగా కురిసిన వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. కొన్ని చోట్ల వడగళ్లు పడ్డాయి. పట్టపగలే దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో... నగరం చీకటిమయంగా మారింది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, యూసుఫ్ గూడ, బేగంపేట్, పంజాగుట్ట, సికింద్రాబాద్, కూకట్ పల్లి, వారాసిగూడ, మల్కాజిగిరి, అబిడ్స్, కోఠి, సుల్తాన్ బజార్, బషీర్ బాగ్, ఆల్వాల్, తిరుమలగిరి, అమీర్ పేట్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. కుండపోత వర్షంతోపాటు, ఈదురు గాలులు కూడా వీయడంతో... పలు చోట్ల హోర్డింగ్ లు విరిగిపడ్డాయి.