chandramohan: ఒక హీరోకి సీన్ ఎలా చెయ్యాలో చెప్పాను .. వెళ్లి డైరెక్టర్ కి ఫిర్యాదు చేశాడు!: చంద్రమోహన్
- ఎన్టీఆర్ .. ఏఎన్నార్ నుంచి ఎంతో నేర్చుకున్నాం
- ఇప్పుడు సీనియర్స్ కి గౌరవం లేదు
- సలహాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు
సీనియర్ కథానాయకులలో చంద్రమోహన్ కి ఒక ప్రత్యేకమైన స్థానం వుంది. తరాలు మారుతూ ఉండటంతో, తనని తాను మార్చుకుంటూ ఆయన తన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు.
" కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన కుర్రాళ్లు .. సీనియర్స్ కి గౌరవం ఇవ్వడం లేదు. గతంలో మేము హీరోలుగా వేసినా .. ఇప్పుడు ఫాదర్ వేషం అనే సరికి కొత్త హీరో సెట్లోకి రాగానే లేచి నుంచుని నమస్కారం పెట్టవలసి వస్తోంది. ఆ హీరో రెండేళ్ల తరువాత ఉంటాడో లేదో తెలియదు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ నుంచి మేం ఎంతో క్రమశిక్షణను .. నటనను నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు సీనియర్స్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు. సీన్ ఇలా చేస్తే బాగుంటుందని కూడా చెప్పకూడదు. అలా ఒక హీరోకి చెప్పినందుకు వెళ్లి డైరెక్టర్ కి ఫిర్యాదు చేశాడు. ఆ హీరో జోలికి వెళ్లొద్దని ఆ దర్శకుడు నాకు దణ్ణం పెట్టేశాడు" అని చెప్పుకొచ్చారు.