ali: నేను గర్వంగా చెప్పుకుంటాను .. మా నాన్న ఒక టైలర్: అలీ
- నేను గోల్డెన్ స్పూన్ తో పుట్టలేదు
- నా గతాన్ని ఎప్పటికీ మరచిపోను
- అహంభావంతో మాట్లాడే అలవాటే లేదు
బాల నటుడిగా తెలుగు తెరకి పరిచయమైన అలీ .. హాస్యనటుడిగా ఎదిగారు. ఒకానొక సమయంలో హీరో అనిపించుకున్నారు కూడా. ప్రస్తుతం కమెడియన్ గా బిజీ అయిన ఆయన, తాజాగా ఐడ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్ గురించిన అనేక విషయాల గురించి ప్రస్తావించారు.
"నేను గోల్డెన్ స్పూన్ తో పుట్టలేదు .. ఆ విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటూ వుంటాను. అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను .. పుట్టిన ఊరును ఎప్పటికీ మరచిపోను. సాధించిన విజయాలను కాలుమీద కాలేసుకుని చెప్పుకునే అలవాటు నాకు లేదు. మా ఫాదర్ ఒక టైలర్ .. ఆ రోజుల్లో నిజంగానే ఆయన గొప్ప టైలర్. భరతనాట్యం .. కూచిపూడి .. కథాకళికి సంబంధించిన డ్రెస్ లు అప్పట్లో అక్కడ మా ఫాదర్ ఒక్కరే కుట్టేవారు. ఇక అప్పట్లో ఫోర్ పీస్ సూట్లు కుట్టడంలో మా నాన్న సిద్ధహస్తుడు. అది చాలా కష్టమైన పని .. అందులో మా ఫాదర్ కి మంచి నైపుణ్యం ఉండేది. మిగిలిపోయిన క్లాత్ తో మా నాన్న నాకు సూట్ కుట్టేవారు .. ఆ డ్రెస్ నేను వేసుకెళితే అంతా గొప్పగా చూసేవాళ్లు" అని చెప్పుకొచ్చారు.