ali: నేను గొప్పవాణ్ణి కావాలనుకుని ఇక్కడికి రాలేదు: అలీ

  • ఒక్కో మెట్టే పైకి ఎక్కాను 
  • అదంతా భగవంతుడి అనుగ్రహమే 
  • వైకుంఠపాళిని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాను  

తెలుగు తెరపై హాస్య నటుడిగా అలీకి ప్రత్యేకమైన స్థానం వుంది. అలాంటి అలీ తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. " సినిమా ఇండస్ట్రీకి ఎవరైనా సరే నేను ఇంత గొప్పవాడిని కావాలనుకుని వస్తే అవ్వలేరు .. నాకు ఇది చాలు అనుకున్న వాళ్లను మాత్రం భగవంతుడు ఇంకో మెట్టు ఎక్కిస్తాడు. ఒకేసారి 100 మెట్లు ఎక్కలేం .. అలా ఎక్కడానికి నేను ప్రయత్నించలేదు"

"మెట్టు మెట్టుగా ఎక్కమనే ఏ తల్లిదండ్రులైనా చెబుతుంటారు. తొందరపడి ఒకేసారి పైకి ఎక్కడానికి ప్రయత్నించవద్దనే విషయం చెప్పడం కోసమే మనకి 'వైకుంఠపాళి' కనిపిస్తుంది. ఎక్కడైనా సరే నిచ్చెనలే కాదు .. పాములు కూడా వుంటాయి. నా కంటే గొప్పగా నటించేవాళ్లు .. అందగాళ్లు ఎంతోమంది ఉన్నారు. కానీ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. అందుకే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే కాన్సెప్ట్ ను వంట బట్టించుకున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.    

ali
  • Loading...

More Telugu News