stock market: లాభాలతో ప్రారంభమై.. చివరకు బేర్ మన్న మార్కెట్లు
- అమ్మకాలకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
- 232 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- నష్టాలను మూటగట్టుకున్న బ్యాంకింగ్ షేర్లు
మన స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోనే ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లోనే మార్కెట్లు ప్రారంభమయినప్పటికీ... అదే జోరును కొనసాగించలేకపోయాయి. కర్ణాటక రాజకీయ పరిస్థితులతో పాటు కంపెనీల త్రైమాసిక ఫలితాలపై దృష్టి సారించిన ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 232 పాయింట్లు పతనమై 34,616కు పడిపోయింది. నిఫ్టీ 80 పాయింట్లు కోల్పోయి 10,517 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
డీబీ కార్పొరేషన్ (6.12%), బలరాంపూర్ చీనీ మిల్స్ (5.77%), బ్యాంక్ ఆఫ్ ఇండియా (5.31%), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (4.62%), కెనరా బ్యాంక్ (4.39%).
టాప్ లూజర్స్:
జైప్రకాశ్ అసోసియేట్స్ (-18.86%), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (-12.70%), స్ట్రైడ్స్ షాసూన్ లిమిటెడ్ (-11.91%), ఇండియాబుల్స్ రియలెస్టేట్ (-10.01%), అశోక్ లేల్యాండ్ (-9.50%).