Maharashtra: పురుషుడిగా మారేందుకు మహిళా కానిస్టేబుల్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

  • పురుషుడిగా మారేందుకు అనుమతి నిరాకరించిన డీజీపీ
  • హైకోర్టును ఆశ్రయించిన మహిళా కానిస్టేబుల్
  • హైకోర్టు సూచనతో అనుమతించిన ప్రభుత్వం
  • ఆసుపత్రిలో చేరిన లలిత

పురుషుడిగా మారేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఓ మహిళా కానిస్టేబుల్ పెట్టుకున్న దరఖాస్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ముంబైకి చెందిన లలిత (29) 2010 నుంచి కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. తాను శస్త్ర చికిత్స ద్వారా పురుషుడిగా మారాలనుకుంటున్నానని, అనుమతించాలని కోరుతూ గతేడాది సెప్టెంబరులో డీజీపీకి లేఖ రాసింది. ఆమె అభ్యర్థనను డీజీపీ తిరస్కరించడంతో ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించింది.

హైకోర్టు సూచన మేరకు ముఖ్యమంత్రి ఫడ్నవిస్, హోంమంత్రి డాక్టర్ రంజిత్ పాటిల్‌లు లలితకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాలతో పోలీసు అధికారులు శస్త్రచికిత్స కోసం లలితకు నెల రోజుల సెలవు మంజూరు చేశారు. ఈ మేరకు ఎస్పీ జి.శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో లలిత జేజే ఆసుపత్రిలో చేరింది.

  • Loading...

More Telugu News