ironleg shastri: ఐరన్ లెగ్ పాత్ర ఎంత మంచి చేసిందో .. అంతే చెడు చేసింది: ఐరన్ లెగ్ శాస్త్రి తనయుడు
- 'ఐరన్ లెగ్' పాత్రతో మంచి పేరు
- అదే పేరు వలన అవకాశాలు తగ్గాయి
- ఈవీవీని ఎప్పుడూ మరిచిపోలేదు
తెలుగు తెరపై ఐరన్ లెగ్ శాస్త్రి చేసిన హాస్యాన్ని ఆడియన్స్ ఇంకా మరిచిపోలేదు. ఆయన భారీ కాయం .. డైలాగ్ డెలివరీ .. లుక్స్ డిఫరెంట్ గా ఉండటంతో ఆయన హాస్య బృందంలో ఒకరుగా మారిపోయారు. అలాంటి శాస్త్రి గురించి ఆయన తనయుడు ప్రసాద్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని విషయాలను పంచుకున్నారు.
'ఐరన్ లెగ్' అనే పాత్రతో నాన్న పాప్యులర్ కావడానికి కారకులు ఈవీవీ సత్యనారాయణ గారు. ఆ సినిమా నుంచే నాన్నకి వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. అయితే ఇటు సినిమాలా .. అటు పౌరోహిత్యమా? అనే సరైన ప్లానింగ్ లేకపోవడం వలన మా నాన్న కెరియర్ దెబ్బతింది. ఇక ఐరన్ లెగ్ అనే పేరును సినిమాలవరకే కదా అని చాలామంది వదిలేయలేదు. నిజంగానే ఐరన్ లెగ్ అనుకుని సినిమాల్లోకి తీసుకోకపోవడం .. కార్యక్రమాలకి పిలవకపోవడం చేశారు. అందువలన ఆయన చాలా బాధపడ్డారు కూడా. అయితే తాము ఈ స్థాయిలో ఉండటానికి కారకులు ఈవీవీ గారేనంటూ ఎప్పుడూ ఆయనను తలచుకుంటూ ఉండేవారు" అని చెప్పుకొచ్చారు.