ironleg shasthri: మా నాన్న నన్ను షూటింగ్స్ కు రానిచ్చేవారు కాదు .. అందుకే ఇలా ఉన్నాను: ఐరన్ లెగ్ శాస్త్రి తనయుడు ప్రసాద్
- మా నాన్న మంచి నటుడు
- నాకు షూటింగ్స్ కి వెళ్లాలని ఉండేది
- నేను బాగా చదువుకోవాలని ఆయనకుండేది
ఒక వైపున పౌరోహిత్యం చేస్తూనే మరో వైపున హాస్యనటుడిగా కొనసాగుతూ ఐరన్ లెగ్ శాస్త్రి దాదాపు 100 సినిమాల వరకూ చేశారు. ఆయన గురించి తనయుడు ప్రసాద్ తాజా ఇంటర్వూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. " మా నాన్న సినిమాలతో బిజీగా ఉండేవారు .. దాంతో నేను షూటింగ్స్ కి వస్తానని అడిగేవాడిని. కానీ ఆయన ఎప్పుడూ ఒప్పుకునేవారు కాదు"
"నా దృష్టి చదువు పై నుంచి సినిమాల వైపు వెళ్లకూడదనేది ఆయన ఆలోచన. కానీ ఆ వయసులో నాకు అది అర్థమయ్యేది కాదు. ఆ సమయంలో ఆయన అలా వ్యవహరించాడు కనుకనే, ఈ రోజున మంచి చదువు చదువుకుని ఈ స్థాయిలో వున్నాను. అప్పట్లో ఆయన ఓకే అనేసి వుంటే .. నా చదువు ఇంటర్లోనే ఆగిపోయి ఉండేది. ఆయన పెద్దగా చదువుకోలేదు .. అందువల్లనే నేను బాగా చదువుకోవాలని ఆశ పడ్డారు .. అది నెరవేర్చాను" అని చెప్పుకొచ్చాడు.