Actress: మూడో బిడ్డకు తల్లికాబోతున్న రంభ.. ఆనందాన్ని ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదని వ్యాఖ్య
- 90లలో హీరోయిన్గా క్రేజ్
- వివాహం అనంతరం సినిమాలకు దూరం
- ఇప్పటికే ఇద్దరు పిల్లలు
హీరోయిన్గా 90 దశకంలో ఓ వెలుగు వెలిగిన రంభ తెలుగుతోపాటు తమిళ, మలయాళం, హిందీ, భోజ్పురి సినిమాల్లోనూ నటించి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కెనడా వ్యాపారవేత్త ఇంద్రన్ పద్మనాథన్ను పెళ్లాడి సినిమాలకు దూరమైంది. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు లాన్య, శాషా ఉన్నారు. ఇప్పుడు రంభ మరో గుడ్ న్యూస్ చెప్పింది. తాను ముచ్చటగా మూడోసారి తల్లిని కాబోతున్నానని, ఈ ఆనందాన్ని ఎలా పంచుకోవాలో అర్థం కావడం లేదని పేర్కొంది. తనను అభిమానించే వారందరితోనూ ఈ ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నానని రంభ పేర్కొంది.