Nipha: కేరళను దాటి కర్ణాటకకు నిపా వైరస్... తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్!
- సరిహద్దులు దాటిన వైరస్
- కర్ణాటకలో ఇద్దరికి సోకిన వ్యాధి
- సరిహద్దు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తం
గబ్బిలాలు, పందుల ద్వారా వ్యాపిస్తూ కేరళలో మృత్యు ఘంటికలు మోగిస్తున్న నిపా వైరస్ సరిహద్దులు దాటి కర్ణాటకలోకి ప్రవేశించింది. అక్కడ ఇద్దరికి ఈ వ్యాధి సోకినట్టు వైద్యలు నిర్దారించారు. వారికి ప్రత్యేక చికిత్సను అందిస్తున్నామని, ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఇక ఈ వైరస్ కర్ణాటక దాటి తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉండటంతో, సరిహద్దు జిల్లాల కలెక్టర్లను, అధికారులను కేసీఆర్, చంద్రబాబు ప్రభుత్వాలు అలర్ట్ చేశాయి.
జ్వరం వచ్చి, నాలుగైదు రోజులుగా తగ్గకుంటే, వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా, నిపా వైరస్ గురించి ఎటువంటి ఆందోళనా అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి నడ్డా వ్యాఖ్యానించారు. లక్షణాలు కనిపించగానే తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఆయన అన్నారు.