Tamilnadu: ఆత్మరక్షణ కోసమే పోలీసుల కాల్పులు.. 13 మంది మృతి: తమిళనాడు సీఎం వివరణ
- ఈ ఘటన వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయి
- సంఘ వ్యతిరేక శక్తులు కూడా ఉన్నాయి
- ఆందోళనకారులను తప్పుదోవ పట్టించాయి
- ఆత్మరక్షణ కోసమే పోలీసుల కాల్పులు
తూత్తుకూడి ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ఈ ఘటన వెనుక రాజకీయ పార్టీలు, సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నాయని, ఆందోళనకారులను తప్పుదోవ పట్టించాయని అన్నారు. పోలీసుల కాల్పుల్లో 13 మంది మృతి చెందారని ఆయన ప్రకటించారు.
ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారని, దాడి చేయడానికి దూసుకొస్తోన్న వారి నుంచి తమను తాము కాపాడుకోవాలని ఎవరైనా అనుకుంటారని వ్యాఖ్యానించారు. కాగా, తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ తయారీ ప్లాంటును మూసివేయాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.