rajnath singh: తూత్తుకుడిలో పరిస్థితిపై మోదీ ఆందోళన చెందుతున్నారు: రాజ్నాథ్ సింగ్
- శాంతి యుతంగా ఉండాలి
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
- కేంద్ర హోం శాఖ విచారణ జరుపుతోంది
- తమిళనాడు ప్రభుత్వం నుంచి నివేదిక అడిగాం
తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ తయారీ ప్లాంటుకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనల్లో పోలీసుల చేతిలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ... ఈ ఘటన గురించి తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతి చెందానని అన్నారు.
తూత్తుకుడి పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆందోళన చెందుతున్నారని, శాంతి యుతంగా ఉండాలని ఆ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాని తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ విచారణ జరుపుతోందని, తమిళనాడు ప్రభుత్వం నుంచి నివేదిక అడిగామని పేర్కొన్నారు.