sensex: ఐటీ, బ్యాంకింగ్ జోరు.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- మధ్యాహ్నం నుంచి పుంజుకున్న మార్కెట్లు
- 318 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 84 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
నిన్న భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు ఈ రోజు పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న సానుకూల సంకేతాలతో పాటు ఐటీ, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు పెరగడంతో లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం మార్కెట్లు నెమ్మదిగా కొనసాగినప్పటికీ... మధ్యాహ్నం తర్వాత భారీగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 318 పాయింట్లు లాభపడి 34,663కి పెరిగింది. నిఫ్టీ 84 పాయింట్లు పుంజుకుని 10,514కు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా (19.07%), ఎన్సీసీ (8.80%), కావేరీ సీడ్ కంపెనీ (7.47%), ఆస్ట్రాల్ పాలీ టెక్నిక్ లిమిటెడ్ (7.00%), జస్ట్ డయల్ (6.60%).
టాప్ లూజర్స్:
జీఈ టీ అండ్ డీ ఇండియా (-8.50%), గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ (-7.31%), జెట్ ఎయిర్ వేస్ (-7.03%), ఆయిల్ ఇండియా లిమిటెడ్ (-6.83%), టాటా మోటార్స్ (-6.56%).