Warangal Urban District: తెలంగాణ ఆర్థికమంత్రి ఈటలకు రూ. 2,300 జరిమానా విధించిన రైల్వే న్యాయస్థానం!
- ఉద్యమం వేళ రైల్ రోకోల్లో పాల్గొన్న మంత్రి
- రెండు కేసులను విచారించిన కాజీపేట రైల్వే కోర్టు
- ఓ కేసులో రూ. 1,500, మరో కేసులో రూ. 800 జరిమానా
తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న వేళ, అప్పటి వరంగల్ జిల్లా ఉప్పల్ రైల్వే స్టేషన్ లో నిరసనలు తెలిపిన కేసుల్లో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కు రూ. 2,300 జరిమానా విధిస్తున్నట్టు కాజీపేట రైల్వే కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పి శ్రీవాణి తీర్పిచ్చారు. ఉద్యమంలో భాగంగానే రైళ్లను అడ్డుకున్నామని, తాను చేసింది తప్పేనని ఈటల న్యాయమూర్తి ముందు అంగీకరించడంతో ఈ తీర్పు చెప్పారు. 2009, డిసెంబర్ 6న చేసిన రైల్ రోకో కేస్లో రూ. 1,500.. 2012, సెప్టెంబర్ 7న చేసిన రైల్ రోకో కేసులో రూ. 800 జరిమానాగా విధిస్తున్నట్టు తీర్పిచ్చారు. ఈ కేసులో మరికొందరిపైనా ఇంతే మొత్తాన్ని జరిమానాగా విధిస్తున్నట్టు తెలిపారు.