Srikakulam District: పాలకొండ ప్రజలు తమ ప్రేమాభిమానాలతో నన్ను నలిపేశారు: పవన్ కల్యాణ్
- నేతలు తమ మాటలు మార్చారు.. అందుకే, జనంలోకి వచ్చాను
- ప్రత్యేకహోదాపై చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర వెనుకబడేది కాదు
- ఉత్తరాంధ్ర అభివృద్ధిని అటకెక్కించారు
- అడవిపుత్రులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది
పాలకొండ ప్రజలు తమ ప్రేమాభిమానాలతో తనను నలిపేశారంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పవన్ పోరాటయాత్ర కొనసాగుతోంది. పాలకొండలోని దుర్గగుడి నుంచి చెక్ పోస్ట్ వరకు నిర్వహించిన కవాతులో ఆయన పాల్గొన్నారు.
అనంతరం పాలకొండ బహిరంగసభలో పవన్ మాట్లాడుతూ, నేతలు ఇచ్చిన మాటలు మార్చారు కనుకనే, తాను జనంలోకి వచ్చానని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదాపై మొదటి నుంచీ చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర వెనుకబడేది కాదని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అటకెక్కించారని, అడవిపుత్రులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తోటపల్లి రిజర్వాయర్ గురించి ప్రస్తావించారు. ఈ రిజర్వాయర్ కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని, రైతు సమస్యలు పరిష్కారం కావడం లేదని మండిపడ్డారు. రైతులు కంటతడి పెడుతుంటే తనకు ఎంతో బాధ కలుగుతోందని వాపోయారు.