Tollywood: ‘ఫ్యామిలీ వెడ్డింగ్’ అంటూ ఫొటోలు పోస్ట్ చేసిన ఉపాసన
- ఉపాసన కజిన్ అనిందిత్ తో శ్రియాభూపాల్ పెళ్లి
- ప్యారిస్ లో జరిగిన వివాహం
- ఈ వివాహానికి హాజరైన రామ్ చరణ్ దంపతులు
అక్కినేని కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టబోయి మిస్సయిన శ్రియాభూపాల్ గుర్తుండే ఉంటుంది. హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కజిన్ అనిందిత్ తో ఆమె వివాహం జరిగింది. ఫ్రాన్స్ లోని ప్యారిస్ సమీపంలో శ్రియాభూపాల్ - అనిందిత్ వివాహం జరిగినట్టు సమాచారం. ఈ వివాహానికి రామ్ చరణ్ దంపతులు హాజరయ్యారు. ఈ విషయాన్ని ఉపాసన తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోలను ఉపాసన పోస్ట్ చేసింది. ఈ వివాహం చాలా సింపుల్ గా కొంతమంది కుటుంబసభ్యుల మధ్య జరిగింది.