stock market: మూడీస్ రేటింగ్ తో నష్టాలలో స్టాక్ మార్కెట్లు
- 43 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 19 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 16 శాతం పైగా లాభపడిన నవ భారత్ వెంచర్స్
అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో పాటు, దేశ వృద్ధి రేటు అంచనాలను మూడీస్ తగ్గించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో, ఈ ఉదయం నుంచే స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగాయి. అయితే, చివర్లో కాస్త కోలుకున్నప్పటికీ చివరకు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 43 పాయింట్లు నష్టపోయి 34,906కు పడింది. నిఫ్టీ 19 పాయింట్లు కోల్పోయి 10,614 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నవ భారత్ వెంచర్స్ (16.57%), క్రిసిల్ (13.72%), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (9.72%), ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా (8.78%), జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ (6.52%).
టాప్ లూజర్స్:
దిలీప్ బిల్డ్ కాన్ లిమిటెడ్ (-12.87%), అబాన్ ఆఫ్ షోర్ (-7.26%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (-4.64%), హెచ్సీఎల్ ఇన్ఫోసిస్టం (-4.63%), అవంతి ఫీడ్స్ (-4.29%).