Karnataka: కర్ణాటక ఉప ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయిన జేడీఎస్!
- ఆర్ఆర్ నగర్ లో ఐదు రౌండ్ల కౌంటింగ్
- 23 వేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి
- రెండో స్థానంలో బీజేపీ
కర్ణాటకలో బస్తాల కొద్దీ ఓటర్ గుర్తింపు కార్డులు ఒకే చోట లభించిన తరువాత ఎన్నిక వాయిదా పడ్డ రాజరాజేశ్వరి నగర్ (ఆర్ఆర్ నగర్) ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ మధ్య ముక్కోణపు పోటీ జరుగగా, కాంగ్రెస్ అభ్యర్థి భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఐదో రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్నం 23 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉండి, గెలుపు దిశగా దూసుకెళుతున్నారు. ఆయనకు 41,625 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి మునిరాజగౌడ 17,948 ఓట్లతో, ఆయన తరువాత జేడీఎస్ అభ్యర్థి రామచంద్ర 8,470 ఓట్లతో ఉన్నారు. తనను గెలిపిస్తే కుమారస్వామి సహకారంతో నియోజకవర్గానికి ఎంతో చేస్తానని రామచంద్ర ప్రచారం చేసుకున్నా ఫలితం దక్కలేదు.