Hot Summer: నడిచే పరిస్థితుల్లో లేని వైఎస్ జగన్... నేటి పాదయాత్రకు విరామం!

  • ఎండ వేడిమికి వడదెబ్బ
  • ఇప్పటివరకూ 2,200 కి.మీ. నడిచిన జగన్
  • విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు

ఎండ వేడిమికి వడదెబ్బకు గురైన వైకాపా అధినేత వైఎస్ జగన్, తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. గడచిన ఆరు నెలల నుంచి ప్రజా సంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న ఆయన, ఇప్పటివరకూ 2,200 కిలోమీటర్లకు పైగా నడిచారు. జ్వరంతో పాటు జలుబు, తలనొప్పితో జగన్ బాధపడుతూ ఉండటంతో, వైద్యులు ఆయన్ను విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

దీంతో నేటి తన పాదయాత్రకు విరామం ఇచ్చిన జగన్, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన్ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసేందుకు వైకాపా నేతలు క్యూ కట్టారు. కాగా, రేపు ఆయన హైదరాబాద్ కు వచ్చి నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సివుంది. కోర్టుకు జగన్ వస్తారా? లేక రాలేకపోతున్నట్టు పిటిషన్ సమర్పిస్తారా? అన్న విషయమై స్పష్టత లేదు.

  • Loading...

More Telugu News