sensex: రుతుపవనాల ప్రభావం.. 416 పాయింట్ల లాభంతో దూసుకుపోయిన సెన్సెక్స్!
- 416 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 10,736కు చేరిన నిఫ్టీ
- మంచి వర్షాలు కురుస్తాయనే అంచనాలతో ఇన్వెస్టర్లలో పెరిగిన సెంటిమెంట్
సకాలంలో రుతుపవనాలు రాబోతున్నాయని, ఈ ఏడాది మంచి వర్షపాతం నమోదవుతుందనే అంచనాలతో స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. దీనికి తోడు జీడీపీ కూడా పెరగనుందనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటి మెంట్ ను పెంచాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 416 పాయింట్లు పెరిగి 35,322కి ఎగబాకింది. నిఫ్టీ 122 పాయింట్లు పుంజుకుని 10,736కు పెరిగింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సుందరం ఫాస్టెనర్స్ లిమిటెడ్ (7.86%), సిటీ యూనియన్ బ్యాంక్ (7.31%), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (6.86%), ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్ వేర్ లిమిటెడ్ (5.93%), టోరెంట్ ఫార్మా (5.72%).
టాప్ లూజర్స్:
సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ (-19.52%), బాంబే డయింగ్ (-11.32%), క్రిసిల్ (-10.58%), దిలీప్ బిల్డ్ కాన్ లిమిటెడ్ (-9.07%), హ్యాత్ వే కేబుల్ అండ్ డేటా (-7.85%).