bellamkonda srinivas: భారీ రేటుకు బెల్లంకొండ సినిమా హిందీ శాటిలైట్ హక్కులు!

  • బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రంగా 'సాక్ష్యం'
  • తదుపరి సినిమా షూటింగ్ మొదలు 
  • కథలోని కొత్తదనంపై అందరిలోను ఆసక్తి       

తెలుగులోని యువ కథానాయకులంతా ఎవరి స్థాయిలో వాళ్లు దూకుడు చూపిస్తూ వెళుతున్నారు. ఈ రేస్ లో ఎంతమాత్రం వెనుకబడకుండా బెల్లంకొండ శ్రీనివాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. త్వరలోనే తన తాజా చిత్రం 'సాక్ష్యం'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆయన రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో ఆయన వున్నాడు.

ఇదిలా ఉంచితే, తదుపరి చిత్రాన్ని శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడితో చేస్తున్నాడు. కాజల్ కథానాయికగా ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ మొదలైపోయింది. ఈ కథ కొత్తదనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ ఉత్కంఠ భరితంగా సాగిపోతుందట. ఈ టాక్ బయటికి రాగానే అందరి దృష్టి ఈ ప్రాజెక్టు వైపుకు మళ్లిందని అంటున్నారు.

ఈ కారణంగానే ఓ పెద్ద సంస్థ ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుందట. ఇందుకోసం వాళ్లు 9.5 కోట్లను చెల్లించినట్టుగా సమాచారం. షూటింగ్ మొదట్లోనే ఒక యంగ్ హీరో సినిమాకి హిందీ శాటిలైట్ రైట్స్ ఈ స్థాయిలో పలకడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే!        

  • Loading...

More Telugu News