Vijayawada: బెజవాడ దుర్గమ్మ గుడిలో సమసిన వివాదం!
- క్షురకుడిని కొట్టిన పాలకమండలి సభ్యుడు
- ఆందోళనకు దిగిన నాయీ బ్రాహ్మణులు
- ఈవో గౌరంగ బాబు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చర్చలు
విజయవాడ దుర్గమ్మ గుడి కేశఖండన శాలలో పనిచేస్తోన్న క్షురకుడిపై పాలకమండలి సభ్యుడు పెంచలయ్య చేయి చేసుకోవడంతో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఓ భక్తుని నుంచి క్షురకుడు పది రూపాయలు తీసుకున్నట్లు గమనించిన పెంచలయ్య ప్రశ్నించడంతో ఈ వివాదం చెలరేగింది.
క్షురకుడిపై పెంచలయ్య ప్రవర్తనను నిరసిస్తూ నాయీ బ్రాహ్మణులు ఆందోళనకు దిగడంతో.. దుర్గగుడి ఈవో గౌరంగ బాబు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వారితో చర్చలు జరిపారు. తమను ఉద్యోగులుగా నియమించి, జీతాలు కూడా ఇవ్వాలని నాయీ బ్రాహ్మణులు డిమాండ్ చేయడంతో వారి డిమాండ్లకు ఒప్పుకున్నారు. అలాగే, పెంచలయ్యతో క్షురకుడికి క్షమాపణ చెప్పించడంతో వారు శాంతించారు.