Jammu And Kashmir: కశ్మీర్‌ సమస్యకు నా దగ్గర ఓ పరిష్కారం ఉంది: గౌతమ్ గంభీర్‌ ట్వీట్

  • సమస్యాత్మక ప్రాంతాల్లోకి రాజకీయ నాయకులను పంపాలి
  • ఓ వారం పాటు ఎలాంటి రక్షణ లేకుండా వారు నివసించాలి
  • ఆ తరువాతే వారిని 2019 ఎన్నికల్లో పోటీకి అనుమతించాలి
  • అప్పుడే వారికి సైనిక దళాల బాధలేమిటో తెలుస్తాయి

'తట్టుకోలేకపోతున్నాను... రాళ్ల దాడి చేసేవారితో ఇంకా చర్చలు జరిపేందుకు అవకాశముందని భారత్‌ భావిస్తోందా?' అంటూ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ ట్వీట్‌ చేశాడు. ఇటీవల కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్‌ వాహనంపై స్థానికులు రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోను రిపబ్లిక్‌ టీవీ అసోసియేట్‌ ఎడిటర్‌ ఆదిత్య రాజ్‌ కౌల్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేస్తూ... నౌహట్టాలో సీఆర్పీఎఫ్‌ వాహనాన్ని లక్ష్యంగా ఎంచుకొని రాళ్ల దాడి చేశారని, ఒకవేళ ఆ వాహనం తలుపులు తెరిస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండని ట్వీట్‌ చేశారు.

కశ్మీర్‌లోని ఏ మీడియా ఈ ఘటనను బయటకు చూపించదని అన్నారు. దీనిపై స్పందించిన గంభీర్‌ ట్వీట్‌ చేస్తూ... ఒక్కసారి వాస్తవ పరిస్థితిని గ్రహించాలని, రాజకీయ మద్దతు ఇస్తే సైనిక దళాలు, సీఆర్పీఎఫ్‌ సత్తా ఏమిటో, ఫలితాలేమిటో చూపిస్తాయని అన్నాడు. మరో ట్వీట్‌ చేస్తూ తన దగ్గర ఓ పరిష్కారం ఉందని, కశ్మీర్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో రాజకీయ నాయకులు ఓ వారం పాటు ఎలాంటి రక్షణ లేకుండా వారి కుటుంబాలతో నివసించాలని అన్నాడు. ఆ తరువాతే వారిని 2019 ఎన్నికల్లో పోటీచేసేందుకు అనుమతించాలని, అప్పుడే వారికి సైనిక దళాల బాధలేమిటో, అసలు కశ్మీర్‌ అంటే ఏమిటో తెలిసివస్తుందని పేర్కొన్నాడు. గతంలోనూ పలుసార్లు సైనికుల సమస్యలపై గౌతమ్‌ గంభీర్‌ ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.     

  • Loading...

More Telugu News