Srikalahasti: శ్రీకాళహస్తి ఈఓ భ్రమరాంబను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం!

  • కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు సర్కారు
  • కర్నూలు సంయుక్త కలెక్టర్ గా ఉన్న రామస్వామి నియామకం
  • భ్రమరాంబకు మరో పోస్టు ఇవ్వని ఉన్నతాధికారులు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భ్రమరాంబను బదిలీ చేస్తూ ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె స్థానంలో రామస్వామిని ఆలయ ఈఓగా నియమిస్తున్నట్టు ఉత్తర్వులు వెలువరించింది. ప్రస్తుతం రామస్వామి, కర్నూలు జిల్లా సంయుక్త కలెక్టర్-2గా విధులు నిర్వహిస్తున్నారు.

కాగా, భ్రమరాంబకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో ఉంచిన ప్రభుత్వం, ఆమెను ఎండోమెంట్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశించింది. ఇటీవలి కాలంలో శ్రీకాళహస్తిలో భ్రమరాంబ వైఖరి వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆలయంలోని అన్న ప్రసాదాల కౌంటర్ ను మరో ప్రాంతానికి తరలించడం, పూజారులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ, కొన్ని సేవలను ఆపించడం, రాహుకేతు పూజల రేట్లు భారీగా పెంచడం, పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకపోవడం, గత శివరాత్రి సందర్భంగా వచ్చిన పలు వివాదాలు ఆమె బదిలీకి కారణంగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News