sunanda: సునందా పుష్కర్ మృతి కేసు: కాంగ్రెస్ నేత శశిథరూర్‌కు కోర్టు సమన్లు
- 2014లో ఢిల్లీలోని హోటల్లో సునందా పుష్కర్ మృతి
- ఇటీవల కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
- వచ్చేనెల 7 లోపు హాజరుకావాలని కోర్టు ఆదేశం
తన భార్య సునందా పుష్కర్ మృతికేసులో కాంగ్రెస్ నేత శశిథరూర్‌కి పటియాలా హౌస్ కోర్టు ఈరోజు సమన్లు జారీ చేసింది. వచ్చేనెల 7 లోపు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. 2014లో ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్లో సునందా పుష్కర్ మృతి చెందింది. కొన్ని రోజుల క్రితం పోలీసులు ఈ కేసులో పలు కీలక విషయాలు తెలుసుకుని కోర్టుకి నివేదిక సమర్పించారు. మృతికి వారం రోజుల ముందు సునందా పుష్కర్ తన భర్త శశిథరూర్‌కి మెయిల్ పంపిందని, తనకి బతకాలని లేదని, చనిపోవాలని ప్రార్థిస్తున్నానని అందులో ఉందని పోలీసులు ఆ నివేదికలో తెలిపారు.
అనంతరం కూడా ఆయనకు సునంద పలు సార్లు ఫోన్ చేయగా స్పందించలేదని తెలిపారు. తీవ్ర ఒత్తిడికి గురైన ఆమె విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుందని, అందుకు శశిథరూరే కారణమయ్యాడని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో ఈ కేసులో శశిథరూర్‌ను నిందితుడిగా చేర్చే అంశంపై కోర్టు విచారణ జరపనుంది.