GVL Narasimharao: నారా లోకేశ్ ట్వీట్‌కు బీజేపీ నేత జీవీఎల్ కౌంటర్!
- ఏ సాధారణ వ్యక్తయినా సర్కారుని ప్రశ్నించవచ్చు
- యూసీలను నిజాయతీతో సమర్పించాలి
- తప్పుడు లెక్కలతో కాదు
- ఏపీ సర్కారు అసత్య ప్రచారాన్ని బట్టబయలు చేస్తాం
కేంద్ర సర్కారుకి తాము అందించిన యూసీలు సరిగ్గాలేవని అనడానికి జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఎవరని నిన్న ట్విట్టర్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. యూసీలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్రానికి సమర్పించారని, వాటిని సంబంధిత కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆమోదించారని ఆయన అన్నారు. లోకేశ్ చేసిన ట్వీట్‌కు జీవీఎల్ నరసింహారావు ట్విట్టర్లోనే సమాధానమిచ్చారు.
ప్రభుత్వాన్ని ఏ సాధారణ వ్యక్తయినా ప్రశ్నించవచ్చని జీవీఎల్ అన్నారు. వినియోగించుకున్న నిధులకు సంబంధించి యూసీలను నిజాయతీతో సమర్పించాలి కానీ, తప్పుడు లెక్కలతో కాదని చెప్పుకొచ్చారు. ఏపీ సర్కారు చేస్తోన్న దీక్షను నయ వంచన దీక్షతో పోల్చిన జీవీఎల్.. ఆ దీక్షలో ఏపీ సర్కారు చేస్తోన్న అసత్య ప్రచారాన్ని తాము బట్టబయలు చేస్తామని అన్నారు. అలాగే, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలా లోకేశ్ వారసత్వ రాజకీయాలు చేయకూడదని హితవు పలికారు.