stock market: పెరిగిన ముడి చమురు ధరలు.. ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు
- మార్కెట్లపై ప్రభావం చూపిన ముడి చమురు ధరలు
- ఒకానొక సమయంలో 130 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్
- 0.70 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ
అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో మన స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ఆద్యంతం ఒడిదుడుకులను ఎదుర్కొంది. ముడి చమురు ధరలు పెరగడం కూడా మార్కెట్ పై ప్రభావం చూపింది. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 130 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివర్లో ఫార్మా, ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 19 పాయింట్ల నష్టంతో 35,444కు పడిపోయింది. నిఫ్టీ 0.70 పాయింట్ల నష్టంతో 10,768 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా అడ్వాన్స్ డ్ రీసెర్చ్ కంపెనీ లిమిటెడ్ (11.36%), సింటెక్స్ ఇండస్ట్రీస్ (11.07%), యూకో బ్యాంక్ (9.46%), సన్ ఫార్మా (8.13%), పీవీఆర్ లిమిటెడ్ (6.11%).
టాప్ లూజర్స్:
క్వాలిటీ (-4.90%), క్యాస్ట్రాల్ ఇండియా (-4.61%), ఎడిల్ వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (-4.14%), శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ (-3.72%), ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ (-3.68%).