modi: మోదీ భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాం: రాజ్ నాథ్ సింగ్
- ప్రధాని భద్రతను సమీక్షిస్తాం
- మావోయిస్టులు బలహీనపడ్డారు
- వారి ప్రాబల్యం 90 జిల్లాలకు పడిపోయింది
ప్రధాని మోదీని దివంగత రాజీవ్ గాంధీ తరహాలో హత్య చేసేందుకు మావోయిస్టులు ప్లాన్ చేస్తున్నారంటూ పూణే పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సమాచారంతో యావత్ దేశం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, మోదీ భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామని చెప్పారు. ప్రధాని భద్రతను మరోసారి సమీక్షిస్తామని తెలిపారు. మావోయిస్టులు ఇప్పటికే బలహీనపడ్డారని, వారి ప్రాబల్యం 135 జిల్లాల నుంచి 90కి పడిపోయిందని చెప్పారు. ఇందులో కూడా 10 జిల్లాల్లోనే వారు క్రియాశీలకంగా ఉన్నారని చెప్పారు. కశ్మీర్ పర్యటనలో ఉన్న రాజ్ నాథ్ శ్రీనగర్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు.