Vizag: విశాఖ జిల్లాలో... 6 కిలోమీటర్లు భుజాలపై మోస్తూ గర్భిణీ ఆసుపత్రికి తరలింపు!
- అనుకు గ్రామంలో ఘటన
- రోడ్డు మార్గం లేని వైనం
- అంబులెన్స్ సేవలకు అడ్డు
ఇటీవల కేరళలోని పాలక్కడ్ ప్రాంతంలోని అట్టప్పాడి గ్రామంలో ఓ కర్రకు దుప్పటి కట్టి గర్భిణిని అందులో ఉంచి ఏకంగా 7 కిలోమీటర్లు మోసుకెళ్లిన ఘటన మరవక ముందే అచ్చం అలాంటిదే మరో ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది. నిన్న ఆ జిల్లాలోని కోటవురట్ల మండలం గొట్టివాడ పంచాయతీ అనుకు గ్రామంలో ఓ కర్రకు బెడ్షీట్ కట్టి అందులో గర్భిణీని ఉంచి భుజాలపై మోస్తూ ఏకంగా 6 కిలోమీటర్లు నడిచి ఆసుపత్రికి తరలించారు.
తమ గ్రామానికి రోడ్డు మార్గం లేకపోవడంతో అంబులెన్స్ సేవలు కూడా అందడం లేదని ఆ గ్రామస్తులు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం ఎన్నో అవస్థలు పడి కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.