Kodandaram: ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం: ప్రొ.కోదండరామ్
- ఉద్యోగ నియామకాల్లో సరైన మార్గదర్శకాలు లేవు
- రాజ్యాంగ బద్ధంగా ఉండాలి
- ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది
తెలంగాణలో ఉద్యోగ నిమామకాల్లో సరైన మార్గదర్శకాలు లేకపోవడం వల్లే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ విమర్శించారు. ఈరోజు హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉద్యోగ నియామకాలకు చేసే మార్గదర్శకాలు రాజ్యాంగ బద్ధంగా ఉండాలని చెప్పారు.
కామన్ మెరిట్ లిస్టును ఏర్పాటు చేసిన అనంతరమే అభ్యర్థులకు వెబ్ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఇవ్వాలని అన్నారు. ప్రస్తుతం కొన్ని నియామకాల్లో ఇందుకు విరుద్ధంగా ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. ఆ కారణంగానే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. అలాగే, స్థానిక, కుల రిజర్వేషన్లకు సమన్వయం ఉండాలని పేర్కొన్నారు.