bihar: బీహార్‌ పరీక్షా ఫలితాల లీలలు: ఓ విద్యార్థికి 35 మార్కులకి గానూ 40

  • మరో విద్యార్థికి 35 మార్కులకుగానూ 38 మార్కులు
  • ఎన్నో తప్పుల తడకగా పరీక్షా ఫలితాలు
  • వెల్లువెత్తుతోన్న విమర్శలు

పరీక్షల్లో నూరు శాతం మార్కులు వస్తే ఆనందపడతాం. నూరు కంటే ఎక్కువ శాతం మార్కులు వస్తే అవాక్కయిపోతాం. బీహార్‌లో అదే జరిగింది. నిన్న పన్నెండో తరగతి ఫలితాలు విడుదల కాగా, రాహుల్ కుమార్ అనే విద్యార్థికి మ్యాథ్స్ ఆబ్జెక్టివ్‌లో 35 మార్కులకు గానూ 40 మార్కులు వచ్చాయి. అంతేకాదు, ఎన్నో తప్పుల తడకగా ఆ పరీక్ష ఫలితాలు ఉన్నాయి.

భీమ్ కుమార్‌ అనే విద్యార్థికి గణితం థియరీలో 35 మార్కులకి గానూ 38 మార్కులు రాగా, మరో విద్యార్థికి 35 మార్కులకి గానూ 37 వచ్చాయి. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని ఓ విద్యార్థి ఇంగ్లిష్ ఆబ్జెక్టివ్‌తో పాటు రాష్ట్ర భాషలో సున్నా మార్కులు వచ్చి, బౌతిక శాస్త్ర పరీక్ష థియరీలో 35 మార్కులకి పరీక్ష నిర్వహిస్తే 38 మార్కులు వచ్చాయి. బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు అధికారుల నిర్వాకానికి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  

  • Loading...

More Telugu News