urjit patel: ఆర్బీఐ గవర్నర్ ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
- నీరవ్ మోదీ - పీఎన్బీ స్కాంపై ప్రశ్నల వర్షం
- ఎప్పటి నుంచో జరుగుతున్నా ఎందుకు గుర్తించలేకపోయారన్న కమిటీ
- బ్యాంకుల్లో పేరుకుపోతున్న నిరర్థక ఆస్తులపై కూడా చర్చ
ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చుక్కలు చూపించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. వీరప్ప మొయిలీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరైన ఊర్జిత్ పై నీరవ్ మోదీ స్కామ్ గురించి కమిటీ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు.
దీర్ఘకాలంగా కుంభకోణం జరుగుతున్నా ఎందుకు గుర్తించలేకపోయారని ప్రశ్నించారు. బ్యాంకుల్లో పేరుకుపోతున్న నిరర్థక ఆస్తుల (నాన్ పర్ఫామింగ్ అస్సెట్స్)పై కూడా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఊర్జిత్ మాట్లాడుతూ, మొండి బకాయిల వసూలు ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. మే 17న కూడా స్టాండింగ్ కమిటీ ముందు ఊర్జిత్ పటేల్ హాజరయ్యారు.