Imran khan: ఇమ్రాన్‌ఖాన్‌కు షాక్.. ఎన్నికల్లో తనను ఎదుర్కోమంటూ నూరేళ్ల బామ్మ సవాల్!
- బన్ను నియోజకవర్గం నుంచి హజ్రత్ బీబీ పోటీ
- మహిళా సాధికారత కోసం విశేష కృషి చేస్తున్న బామ్మ
- తీవ్రవాదులు బెదిరించినా లెక్క చేయని వృద్ధురాలు
పాకిస్థాన్ ప్రతిపక్ష నేత, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు నూరేళ్ల వృద్ధురాలు ఒకరు షాకిచ్చారు. దేశంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌పై పోటీ చేయనున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. మహిళా సాధికారత, బాలికా విద్య కోసం విశేష కృషి చేస్తున్న హజ్రత్ బీబీ.. బన్ను నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్టు ప్రకటించారు. తనను ఎదుర్కోవాలని ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఇమ్రాన్ ఖాన్‌కు సవాలు విసిరారు.
మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ఈ నూరేళ్ల బామ్మకు ఈ ప్రాంతంలో మంచి పేరుంది. గతంలో ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చినా ఆమె మాత్రం తన సేవా కార్యక్రమాలను ఆపలేదు. ఇప్పుడీ వృద్ధురాలు ఏకంగా ప్రతిపక్ష నేతపై స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.
మరోవైపు పాకిస్థాన్‌లో ఇప్పుడు ఇమ్రాన్ పేరు హాట్ టాపిక్ అయింది. ఆయన భార్య రేహమ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. పెళ్లికి ముందు తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన ఆమె, ఇమ్రాన్ ఓ ‘గే’ అని పేర్కొని కలకలం రేపారు.