Mayur Pan shop: ఉపేంద్ర వర్మ ఫేస్ బుక్ చీటింగ్ కేసులో కొత్త ట్విస్ట్... ఆరోపణలు చేసిన యువతి పలువురితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు!
- ఉపేంద్ర వర్మపై కేసు పెట్టిన సోనూ
- కోటి డిమాండ్ చేసిందన్న ఉపేంద్ర సోదరుడు
- పలు ఫొటోలు మీడియాకు విడుదల
- ఇతరులతోనూ సోనూకు సంబంధాలు?
హైదరాబాద్ లోని ప్రముఖ పాన్ షాప్ రిటైల్ వ్యాపారి ఉపేంద్ర వర్మ, తనను ఫేస్ బుక్ లో పరిచయం చేసుకుని, ట్రాప్ చేసి, స్వీట్ పాన్ లో మత్తు మందు కలిపిచ్చి అత్యాచారం చేశాడని సోనూ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పెట్టిన కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. సోనూకు గతంలో పలువురు యువకులతో సంబంధాలు ఉన్నాయనడానికి ఆధారాలుగా, ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఫొటోలు విడుదల అయ్యాయి.
సోనూ కావాలనే తన సోదరుడిపై వల పన్ని ఇలా తప్పుడు కేసు పెట్టిందని ఆరోపించిన ఉపేంద్ర వర్మ సోదరుడు సురేంద్ర వర్మ, సోనూ గతంలో ఎంతో మందిని మోసం చేసిందని చెబుతూ, వేర్వేరు యువకులతో ఆమె సన్నిహితంగా ఉన్న చిత్రాలను మీడియాకు విడుదల చేశాడు. ఆమె తమ నుంచి కోటి రూపాయలను డిమాండ్ చేసిందని, ఆ డబ్బు ఇచ్చేందుకు నిరాకరించిన తరువాత కేసు పెట్టిందని ఆరోపించారు. ఆమె డ్రగ్స్ తీసుకుంటుందని, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సిటీ పోలీస్ కమిషనర్ కు వివరణ ఇచ్చామని తెలిపాడు.తమ పాన్ షాపుల్లో మత్తుమందులు కలిపి పాన్ లు తయారు చేస్తున్నట్టు నిరూపిస్తే, అన్ని షాపులనూ మూసేస్తామని చెప్పాడు. కాగా, ఈ కేసులో అరెస్టయిన ఉపేంద్ర ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.