India: చాంతాడంత క్యూలో ఇక నిలబడక్కర్లేదు... సాధారణ రైల్వే టికెట్లూ ఇక ఫోన్లలోనే!

  • కొత్త యాప్ విడుదల
  • యూటీఎస్ ఆన్ మొబైల్ పేరిట అందుబాటులోకి
  • సాధారణ టికెట్ల రద్దు సౌకర్యం కూడా

ఇప్పటివరకూ రిజర్వేషన్ టికెట్లను మాత్రమే ఆన్ లైన్, స్మార్ట్ ఫోన్ యాప్స్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం ఉండగా, ఇప్పుడు రిజర్వేషన్ అవసరం లేని సాధారణ టికెట్లను విక్రయించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ ను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. అన్ రిజర్వ్ డ్ టికెట్ (యూటీఎస్) కొనుగోలును మరింత సులభతరం చేస్తూ, రద్దీ సమయాల్లో వేగంగా టికెట్ ను ఎక్కడినుంచైనా పొందేలా రైల్వే సమాచార వ్యవస్థ కేంద్రం ఈ యాప్ ను తయారు చేసింది. 'యూటీఎస్ ఆన్ మొబైల్' పేరిట ఈ యాప్ అందుబాటులోకి రాగా, నగదును రైల్వే వాలెట్ లో జమ చేసుకుని నెలవారీ టికెట్లు, ఏ రైల్వే స్టేషన్ లోనైనా ప్లాట్ ఫాం టికెట్లు కొనుగోలు చేయవచ్చు.

ఏదైనా టికెట్ ను రద్దు చేసుకుంటే, వాలెట్ లోకి జమ అవుతాయి. తొలుత పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వంటి వివరాలు సమర్పించాలని, ఆపై రైల్వే వాలెట్ '0' నిల్వతో ప్రారంభమవుతుందని, ఏదైనా యూటీఎస్ కౌంటర్ లేదా రైల్వే వెబ్ సైట్ ద్వారా దీనిలో నగదు నింపుకోవచ్చని అధికారులు వెల్లడించారు. దీని ద్వారా కొనుగోలు చేసే టికెట్ ను ప్రింటవుట్ తీసుకోవాల్సిన అవసరం లేదని, యాప్ లోకి వచ్చిన టికెట్ ను టీసీలు అడిగినప్పుడు చూపిస్తే సరిపోతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News