Chandrababu: ఏపీలో సాగునీటి కాలువలకు వర్చువల్ త‌నిఖీలు నిర్వ‌హిస్తాం: సీఎం చంద్రబాబు

  • ప్రకాశం బ్యారేజ్ ని డ్రోన్ కెమెరాల‌తో వ‌ర్చువ‌ల్ త‌నిఖీ చేసిన బాబు
  • బ్యారేజీలో గుర్ర‌పుడెక్క పేరుకుపోవ‌డంపై అసంతృప్తి
  • నాలుగు రోజుల్లో మొత్తం శుభ్రం చేయాల‌ని ఆదేశం

రాష్ట్రంలో నీటిపారుద‌ల‌కు సంబంధించిన అన్ని కాలువ‌ల‌ను వ‌ర్చువ‌ల్ విధానంలో ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హిస్తాన‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు తెలిపారు.‌ సచివాల‌యంలోని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ స్టేట్ క‌మాండ్ కేంద్రం నుంచి డ్రోన్ కెమెరాల‌ను ఉప‌యోగించి ప్ర‌కాశం బ్యారేజీకి వ‌ర్చువ‌ల్ త‌నిఖీ ఈరోజు నిర్వ‌హించారు. బ్యారేజీలో గుర్ర‌పుడెక్క ఆకులు పేరుకుపోయి ఉండ‌టంపై ఆయ‌న నీటి పారుద‌రుల శాఖ అధికారుల‌ను ప్ర‌శ్నించారు. ఇన్ని రోజులుగా బ్యారేజీలో గుర్ర‌పు డెక్క ఆకు అలా పేరుకుపోయి ఉంటే అధికారులు ఏం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బ్యారేజీలో పరిస్థితి అలా ఉంటే మీరంతా ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. దుర్గ ఘాట్‌, త‌దిత‌ర ప్రాంతాలను కూడా ఆయ‌న వ‌ర్చువ‌ల్ త‌నిఖీ చేశారు.

నాలుగు రోజ‌ల్లో ప్ర‌కాశం బ్యారేజీలోని నీరు ప‌రిశుభ్రంగా ఉండాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో సాగు నీటి కాలువ‌ల‌న్నీ కూడా ఇదే త‌ర‌హాలో త‌నిఖీ చేస్తాన‌ని తెలిపారు. డ్రోన్ కెమెరాలు ఉప‌యోగించి వ‌ర్చువ‌ల్ త‌నిఖీలు చేస్తాన‌ని, నీటి పారుద‌ల‌కు ఎక్క‌డా కూడా అడ్డంకులు లేకుండా చూడాల‌ని ఆదేశించారు. అధికారులు నిర్ల‌క్ష్యం వ‌హిస్తే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని హెచ్చ‌రించారు. పింఛ‌న్ల పంపిణీపై 79 శాతం సంతృప్తి       
                                                               
రాష్ట్రంలో పింఛ‌న్ల పంపిణీ జ‌రుగుతున్న తీరును కూడా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆర్టీజీ కేంద్రంలో స‌మీక్ష నిర్వ‌హించారు. పింఛ‌న్ల  పంపిణీ ఎలా జ‌రుగుతున్న‌ది, వాటిపై ప్ర‌జా సంతృప్తి శాతం ఎలా ఉంద‌నే అంశాల‌ను రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ ముఖ్య కార్య‌ నిర్వ‌హ‌ణాధికారి బాబు ఏ వివ‌రించారు. పింఛ‌న్ల పంపిణీపై 79 శాతం సంతృప్తిని వ్య‌క్తం చేశార‌ని తెలిపారు. ఈ సందర్భంగా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ, 21 శాతం మంది అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డానికి గ‌ల కార‌ణాలు విశ్లేషించి ఆ లోపాల‌ను భ‌ర్తీ చేయాల‌ని ఆదేశించారు. రాష్ట్రంలో ప్ర‌తి నెలా  47,20,253 మంది పింఛ‌న్లు అందుకుంటున్నార‌ని, పింఛ‌న్ల కోసం ప్ర‌భుత్వం ప్ర‌తి నెలా రూ.549 కోట్లు పంపిణీ చేస్తోంద‌ని, వృద్ధుల‌కు వృద్ధాప్య పింఛ‌న్లు ఆస‌ర‌గా ఉంద‌ని, పింఛ‌న్ల పంపిణీలో ఎలాంటి అవినీతికి తావులేకుండా పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు.

కొన్ని చోట్ల వేలిముద్ర‌లు ప‌డ‌ని స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని, అక్క‌డ ముఖ గుర్తింపు (ఫేషియ‌ల్ రిక‌గ్నిషన్) విధానం అమలు చేస్తామ‌ని, ప్ర‌తి నెల మొద‌టి ప‌ది రోజుల్లోనే దాదాపుగా పింఛ‌న్ల పంపిణీ పూర్తి అయ్యేలా చేస్తామని తెలిపారు. గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో దెయ్యాలు పింఛ‌న్లు తీసుకునేవ‌ని, కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌ని, ఎంతో పార‌దర్శ‌కంగా పింఛ‌న్ల‌ను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఎక్క‌డైనా ఇలాంటి వ్య‌వ‌స్థ ఉందా చెప్పండి? అని మీడియా ప్ర‌తినిధుల‌ను ప్ర‌శ్నించారు. రాబోయే రోజుల్లో కూడా టెక్నాల‌జీని ఉప‌యోగించి అన్ని ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను కూడా ఇదే స్థాయిలో అమ‌లు చేస్తామ‌ని, ప్ర‌భుత్వంలో కూడా ఇప్పుడు ఎవ‌రూ త‌ప్పించుకోలేర‌ని, అంద‌రూ నిజాయ‌తీ, నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేయాల్సిందేన‌ని అన్నారు. 

  • Loading...

More Telugu News