Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై కేసు నమోదు.. నేటీ భేటీకి హాజరు కాబోనన్న సీఎం
- ఎల్జీ విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ ఫిర్యాదు
- సీఎం, మంత్రులపై కేసు నమోదు
- నేటి భేటీకి హాజరు కాబోనన్న కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కేసు నమోదైంది. లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) అనిల్ బైజల్ విధులకు సీఎం ఆటంకం కలిగిస్తున్నారంటూ అధికారులు ఆయనపై పటేల్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై సీఎం కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మంత్రులు సత్యేంద్ర జైన్, గోయల్ రాయ్‌లపై కేసు నమోదు చేశారు.
ఎల్జీ తీరును నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఆయన నివాసంలోనే దీక్ష కొనసాగిస్తున్న కేజ్రీవాల్.. నేడు జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి హాజరు కాలేనని తెలిపారు. ఎల్జీ విధులపై కేంద్రం స్పష్టమైన హామీ ఇస్తేనే సమావేశానికి తాను వస్తానని తేల్చిచెప్పారు. కాగా, ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, చంద్రశేఖరరావులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.