stock market: వాణిజ్య యుద్ధ భయాలతో నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు
- అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం
- ఆద్యంతం లాభనష్టాల్లో ఊగిసలాడిన మార్కెట్లు
- 74 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
భారతీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్న నేపథ్యంలో... ఈనాటి ట్రేడింగ్ ఆసాంతం లాభనష్టాల్లో ఊగిసలాడి, చివరకు స్వల్ప నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 74 పాయింట్లు నష్టపోయి 35,548కి పడిపోయింది. నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 10,800 వద్ద క్లోజ్ అయింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ (13.10%), జై ప్రకాశ్ అసోసియేట్స్ (6.57%), జీహెచ్సీఎల్ (5.37%), హిందుస్థాన్ పెట్రోలియం (5.19%), వక్రాంగీ లిమిటెడ్ (4.98%).
టాప్ లూజర్స్:
బజాజ్ హిందుస్థాన్ షుగర్ లిమిటెడ్ (-5.00%), టొరెంట్ పవర్ (-4.88%), ఎన్సీసీ (-4.20%), ఇంటలెక్ట్ డిజైన్ ఎరీనా లిమిటెడ్ (-4.05%), హెచ్సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్ (-3.84%).